భర్తని శ్రీలంక పంపి ప్రియుడితో వెళ్లింది..చివరకి..!


హైదరాబాద్ కూకట్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ వివాహేతర సంభందం ఆమె బలిగొంది.ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కేపీ హెచ్ బిలో రోడ్డు నెం 2లో ప్రత్యూష, అంజి రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. అంజి రెడ్డి గతేడాది వ్యాపార నిమిత్తం శ్రీలంక వెళ్లిన సందర్భంగా ప్రత్యూష తన స్నేహితుడు శ్రీనివాస్ తో వివాహేతర సంభందం పెట్టుకుంది. ఈ విషయం అంజిరెడ్డి కి తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. అప్పటి ఆ వ్యవహారం సద్దుమణిగింది.

కాగా మూడు నెలల తరువాత శ్రీనివాస్ బాలాజీ నగర్ లోని ఓ పెంట్ హౌస్ లో అద్దెకు దిగాడు.ఇటీవల మరలా అంజిరెడ్డి వ్యాపార నిమిత్తం శ్రీలంక వెళ్ళాడు. ప్రత్యూష తన కూతురిని పుట్టింటిలో వదిలేసి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళింది. శ్రీనివాస్ ప్రత్యుషని తన భార్య గా ఇంటి యజమానికి పరిచయం చేసాడు. కాగా శనివారం ఇంటినుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాలేదు.సోమవారం అతడి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో యజమాని కిటికీలు తెరచి చూసాడు. ఒంటి నిండా గాయాలతో ప్రత్యూష మరణించి ఉంది. యజమాని పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యూష ఒంటి నిండా గాయాలు ఉండడం ఆమె మృత దేహం పక్కెనే కట్టి కూడా ఉండడంతో శ్రీనివాసే హత్య చేసి ఉంటాడని పోలీస్ లు భావిస్తున్నారు.

Comments