ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

విశాఖ‌లో మూడు మెట్రో కారిడార్ల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

మెట్రో రైల్ విశాఖ న‌గ‌రానికి వ‌రంగా మార‌నుందా? అంటే అవున‌నే స‌మాచారం. దూరాభారాన్ని త‌గ్గించి విశాఖ జ‌నుల‌కు బోలెడంత సాయం కానుంది. ఆ మేర‌కు విశాఖ మెట్రోకు నోటిఫికేషన్‌ జారీచేసింది ఏపీ సర్కార్‌. మూడు కారిడార్లలో మొత్తం 42.55 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొద‌ట‌గా.. గాజువాక జంక్షన్‌ నుంచి ఎన్‌.ఎ.డి జంక్షన్‌, గురుద్వార్, మద్దిలపాలెం, హనుమంతవాక మీదుగా కొమ్మాది జంక్షన్‌ వరకు 30.38 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్ నిర్మాణం జ‌ర‌గ‌నుంది. ఇక గురుద్వార్‌ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.25 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ నిర్మిస్తారు. తాటిచెట్ల పాలెం నుంచి చిన వాల్దేరు వరకు 6.9 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ మెట్రో వ‌ల్ల న‌గ‌ర‌వాసుల‌కు చాలావ‌ర‌కూ స‌మ‌యం ఆదా కానుంది. ప్ర‌యాణ దూరం మెజారిటీ పార్ట్ త‌గ్గ‌నుందని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Comments