ప్రచురణ తేదీ : Fri, Jan 6th, 2017

కట్టలు తెంచుకున్న కోహ్లీ కోపం..!

kohli007
భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కోపం కట్టలు తెంచుకుంది. బెంగుళూరులో యువతిపై జరిగిన లైంగిక దాడి పై కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.బెంగుళూరులో జరిగిన ఘటన దారుణమని కోహ్లీ అన్నాడు.\ఇలాంటి ఘటనని చూసి కూడా అడ్డు పడని పిరికి పందలని ఏమంటాం.. వారిని మనుషులు అనగలమా ? ఇలాంటి వారి మధ్య ఈ సమాజంలో ఉంటున్నందుకు సిగ్గుగా ఉందని కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇలాంటి ఘటననే మన కుటుంబ సభ్యులకు జరిగితే ఇలాగే చూస్తూ ఉంటామా ? అంటూ ప్రశ్నించారు. మనదాకా వచ్చేంత వరకు సమస్యలపై స్పందించకుండా ఉండకూడదని కోహ్లీ అన్నాడు.

బెంగుళూరు ఘటన పై కోహ్లీ ట్విటర్ వేదికగా స్పందించాడు.ఆమె దుస్తులు ఆమె ఇష్టం..కలగ జేసుకునే హక్కు మనకు లేదు.అధికారం ఉందికదా అని ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని సమర్ధించడం హేయమైన చర్య అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ట్విట్టర్ వేదికకా తన అభిప్రాయాల్ని కోహ్లీ వీడియో రూపంలో పోస్ట్ చేసాడు.

Comments