రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న ఆయనకు మద్దతివ్వండి : వెంకయ్యనాయుడు

ప్రస్తుతం రాష్ట్రపతి అబ్యర్థిత్వం విషయంలో అధికార పక్ష నేతలు వారి రాజకీయ కోణాన్ని చూపిస్తుంటే.. ప్రతి పక్షాలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే బీజేపీ నేతలు రీసెంట్ గా ప్రతిపక్ష నేతలతో జరిపిన మీటింగ్ విఫలమవడంతో ప్రతిపక్షాల మద్దతు ఎవరికిస్తారనే దానిపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థిగా రామ్ నాథ్ ను బలపరిచిన భాజపా ప్రతిపక్షాల మద్దతు కోరగా వారు నిరాకరించారు. మరికొందరైతే మా తల నరికిన మా మద్దతు ఏ మాత్రం ఇవ్వబోమని గట్టిగా వారిస్తున్నారు. అయితే ఈ విషయంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు.

మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను బలపరచాలని, ఆయన అనుభవజ్ఞుడు, ప్రజ్ఞాశాలి. ఆయనను ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని విపక్షాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం’ అని అన్నారు. అయితే రాష్ట్రపతి విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ప్రశ్నకి ఆయన అనూహ్యంగా నో కామెంట్ అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాకుండా వివాదాస్పదవ్యాఖ్యలు తాము ఎన్నడూ చేయబోయామని విలేకరులకు వెంకయ్యనాయుడు తెలిపారు.

Comments