భారతీయుడిపై దాడి చేసిన వ్యక్తికి మరణ శిక్ష..లేదంటే జీవిత ఖైదు ?

గత నాలుగు నెలల క్రితం అనగా ఫిబ్రవరి నెలలో అమెరికాలోని ఓ భారతీయుడిపై జరిగిన జాత్యహంకార దాడి ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అగ్రరాజ్యానికి అధిపతి అయిన ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే ఈ వివాదం చెలరేగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రపంచదేశాలు సైతం ఈ విధానాన్ని ఖండించాయి. ఈ దాడిలో మారణించిన కూచిబొట్ల శ్రీనివాస్ (32) అనే తెలుగు వ్యక్తిని అమెరికాకు చెందిన పురిన్టన్ (51) అనే వ్యక్తి నా దేశం విడిచి వెళ్ళిపో అని తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో శ్రీనివాస్ మరణించగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ వార్త జాత్యహంకార నేపధ్యలో జరిగిందని ప్రపంచ మీడియా సైతం తెలియజేశింది.

అయితే ఈ విషయంపై అక్కడి న్యాయస్థానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అలాగే మారో హత్య చేయడానికి కూడా ప్రయత్నించినట్లు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన వొఇషయం తెలిసిందే. దీంతో హత్య చేసిన పురిన్టన్ కి యావజ్జివ శిక్షా గాని లేక మరణ శిక్ష గాని విధించే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని ఓ ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్నీ తెలిపింది. అయితే ఎన్ని చర్యలు తీసుకున్న అప్పటినుండి భారతీయుల పట్ల విద్వేషక పూరిత దాడులు జరుగుతున్నాయని. ఈ చర్యలను ఆపడానికి ప్రభుత్వం కృషి చేయాలనీ అక్కడి భారతీయులు ఆవేదన చెందుతున్నారు.

Comments