ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

తండ్రి కోసం ఎవరు చేయని గొప్ప పని చేసిన ఆ కొడుకులు?


ఆస్తుల కోసం, డబ్బు కోసం సొంత తల్లిదండ్రులని అనాధల్లా రోడ్డు మీద వదిలేస్తూ, అవసరం లేదనుకుంటే చంపేసే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా చోడవరం గ్రామంలో ఇద్దరు కొడుకులు చనిపోయిన తండ్రి కోసం ఆలయాన్ని నిర్మించారు. అడపా శ్రీధర్, అడపా చంద్రశేఖర్ అనే ఇద్దరు కొడుకులు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా, రాజకీయ నాయకుడుగా ప్రజలకు విశేషంగా సేవ చేసారు. ఆయన 2002లో చనిపోయారు. ఆయన మృతిని తట్టుకోలేని కొడుకులు, ఆయన కోసం ఓ దేవాలయాన్ని నిర్మించారు. మా తండ్రి మాకు దేవుడు కంటే ఎక్కువ కాబట్టి, ఆయన్ని ఆ స్థానంలో చూసుకోవడం కోసం దేవాలయం కట్టినట్లు ఆ కుమారులు చెప్పారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Comments