ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

బాబు వార్నింగ్, లోకేష్ ఫోన్ కాల్..ఏమీ పనిచేయలేదు..?


రాజకీయ పార్టీ అన్నాక గ్రూప్ పాలిటిక్స్ కామన్. కానీ అవి హద్దు మీరితే పార్టీకే ప్రమాదం. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పరిస్థితి అలాగే ఉంది. ఏ జిల్లాకు ఆ జిల్లాలో గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయి.ఈ వ్యవహారం టిడిపి అధినేత చదన్రాబాబుకు తలనొప్పిలా తయారైంది. విజయవాడ ఎంపీ కేశినేని వ్యవహారం ఆ పార్టీలో ప్రధాన నేతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ట్రాన్స్ పోర్టు అధికారులపై నాని ప్రదర్శిస్తున్న దూకుడు మాములుగా లేదు. ఇప్పటికే చంద్రబాబు కేశినేని వార్నింగ్ ఇచ్చారు..మంత్రి లోకేష్ కూడా కేశినేనితో ఫోన్ లో మాట్లాడారు. అయినా నాని వేటినీ లెక్క చేయడం లేదు. తన దారి తనదే అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహార శైలి.

కేశినేని నాని కృష్ణా జిల్లాలోని సీనియర్లతో సరిగా మెలగరనే కంప్లైంట్ ఇదివరకే చంద్రబాబు వద్దకు వెళ్ళింది.కేశినేని కృష్ణ జిల్లాలో గ్రూప్ పాలిటిక్స్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఆ సమయంలో కూడా బాబు కేశినేనిని మందలించారు. ట్రాన్స్ పోర్టు అధికారులతో గొడవ వద్దని సీనియర్లు చేయబుతున్నా నాని వినడం లేదట. దీనితో అతడి దూకుడు పార్టీ ఎలాంటి నష్టం కలిగిస్తుందో అనే ఆందోళన టిడిపి వర్గాల్లో నెలకొని ఉంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాన్ని ఆసరాగా తీసుకుని ట్రాన్స్ పోర్ట్ అధికారులపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు నుంచి అనుమంతి తీసుకోకుండా నాని స్వయంగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాసారు. దీనితో ఏపీలో ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ పై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. తన కేశినేని ట్రావెల్స్ బస్సు లను ఆపేసిన కేశినేని ట్రాన్స్ పోర్ట్ అధికారులపై విరుచుకుపడడంలో ఉన్న ఆంతర్యం ఎవ్వరికి అర్థం కావడం లేదు. నాని దూకుడు ఇంకెంతకాలం కొససాగుతుందో చూడాలి.

Comments