ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

తెలుగు దేశంలో అధినాయకుడు చంద్రబాబుని ఎవరు లెక్క చేయడం లేదా?

తెలుగు దేశం పార్టీ ఇప్పటి వరకు ఉమ్మది ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం నవ్యాంద్రలో తెలుగు ప్రజల మనోభావాల నుంచి పుట్టుకొచ్చిన పార్టీగా ఓ గొప్ప స్థానం వుంది. నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీని తరువాతి కాలంలో నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతతో హస్తగతం చేసుకున్నాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలో ఉన్న గతంలో చంద్రబాబు మాట వేదవాక్కుగా నాయకులందరు ముందుకు కదిలారు. అయన ఎం చెబితే దానికి ఒకే అంటూ వెళ్ళేవారు. పార్టీలో ఉంటూ ఎ ఒక్కరు చంద్రబాబుని విమర్శించే ధైర్యంగాని , ఎదిరించే ప్రయత్నంగాని చేయాలేదు. అందుకే గతంలో చంద్రబాబు నిర్ణయాలు ఎకస్వామ్యంగా నడిచాయి. అలాగే తెలుగు దేశం పార్టీ హయంలో కుంభకోణాలు ఆనవాళ్ళు కూడా లేకుండా వున్నాయి.

అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. పదేళ్ళు అధికారానికి దూరమైనా తెలుగు దేశం మరల నవ్యాంద్ర లో అధికారాన్ని చేపట్టింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పరిపాలన మూడేళ్ళు దాటిపోయి నాలుగో ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గం లో ఉన్న నాయకులు ఎవ్వరు ఈ సారి లేరు, సుమారు అందరు కొత్తవారు . ఆపై కొత్తగా గెలిచినవారే. వారికీ పాలనా అనుభవం చాలా వరకు శూన్యం అనే చెప్పాలి. దాంతో ప్రస్తుతం ఉన్న నాయకులు ఎవరు కూడా చంద్రబాబు విధానాలకు కట్టుబడి ఉండటం లేదని పార్టీలో వినిపిస్తున్న మాట. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఎవరు కూడా పార్టీ పెట్టిన హద్దుల్లో ఉండకుండా వాటిని అతిక్రమించి సొంత బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అధిష్టానాన్ని దిక్కరిస్తూ, వారికి తోచింది మాట్లాడుతూ పార్టీని ఇరుకున పడేస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం ఇస్తున్నారు.

పార్టీలో క్రింది స్థాయి నాయకుల నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు అధినాయకుడు చంద్రబాబు చెప్పిన మాట వినడానికి సిద్ధంగా లేరని ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు . అందుకే ఎప్పుడు రానిది . క్యాబినెట్ విస్తరణ సమయంలో చాలా మంది మంత్రి పదవులు ఇవ్వలేదని నేరుగా చంద్రబాబుని , పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు. ఇప్పటికి కొందరు ఆ కోపంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా వున్నారు. అలాగే నంద్యాల ఉప ఎన్నిక కోసం అభ్యర్ధి ని ఎంపిక చేయడానికి బాబుకి పెద్ద తలనొప్పి వచ్చింది. పార్టీలో వున్న శిల్పా మోహన రెడ్డి సైతం టికెట్ ఇవ్వని కారణంగా పార్టీ వీడి వేల్ల్పోయారు ఇప్పుడు నంద్యాల లో భూమా కుటుంబానికి సన్నిహితుడుగా పేరున్న ఎ.వి సుబ్బారెడ్డి పార్టీ మీద దిక్కార స్వరం వినిపించాడు. అలాగే బాపట్ల నియోజకవర్గంలో పార్టీలో నాయకులు బాహాటంగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే విజయవాడ లోకూడా పార్టీలో నాయకుల్లో ఒకరి మీద ఒకరికి గొడవలు పడుతున్నారు. ఇక జేసీ దివాకర రెడ్డి లాంటి వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా ఎవ్వరు అధినేత చంద్రబాబు నిర్ణయాలకు, ఆయన మాటలకు కట్టుబడి లేకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనేది ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న మాట. పార్టీ మీద, నాయకుల మీద చంద్రబాబు ప్రాభల్యం తగ్గుతుందని, ఒకప్పటిలా ఆయన చెప్పు చేతల్లో ఉన్న నాయకులు ఇప్పుడు పార్టీలో లేరని తెలుస్తుంది.

ఈ కారణాలా వలెనే, ఎప్పుడు లేనిదీ టీడీపీ అధికారంలో ఉన్న తర్వాత కూడా కుంభకోణాలు, కాల్ మనీ ర్యాకెట్ లు, భూ ఆక్రమణలు, ఇలా ఎన్నడూ లేని స్థాయిలో అవినీతి ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోయింది. అదే సమయంలో కనుమరుగయ్యాయి అనుకున్న ఫ్యాక్షన్ హత్యలు కూడా తిరిగి పురుడు పోసుకొని తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇవన్ని తెలుగు దేశం పార్టీకి చేటు చేసేవే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం తెలుగు దేశం పార్టీలో నాయకుల ప్రవర్తన పార్టీని ప్రజల నుంచి దూరం చేస్తుందని విశ్లేషకులు అనుకుంటున్నారు.

Comments