ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

టీడీపీ నేత సోమిరెడ్డి కి విదేశాల్లో ఆస్తులు .. ఎంతవరకూ నిజం ?

somireddy
టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర మోహనరెడ్డి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి అంటూ వైకాపా చేస్తున్న ఆరోపణల సంగతి తెలిసిందే. దానికి సంబంధిచిన ఆధారాలని వైకాపా నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా కి అప్పజెప్పారు. దీని మీద సోమిరెడ్డి సీరియస్ అయ్యి విజయవాడ డీజీపీ కి ఫిర్యాదు చేసారు. కాకాని ఇచ్చిన కాగితాల మీద పోలీసులు దర్యాప్తు చేపట్టి అవన్నీ తప్పుడు ఆధారాలు అని చెబుతున్నారు. న‌కిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తోన్న ఓ ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు.విదేశాల్లోని రెవెన్యూ అథారిటీ వెబ్‌సైట్ లోకి వెళ్లి అక్క‌డి వివ‌రాలు, ముద్ర‌లను ప‌రిశీలించి ఈ ముఠా న‌కిలీ డాక్యుమెంట్ల‌ను క్రియేట్ చేసిందని ఎస్పీ తేల్చిచెప్పారు. వివాదాల్లో ఉన్న నేత‌ల‌ను ప‌రిశీలించి వారిపై న‌కిలీ డాక్యుమెంట్ల‌ను సృష్టించి ఈ ముఠా అమ్ముకుంటోంద‌ని చెప్పారు. ఇలాంటి క‌ల్చ‌ర్ రావ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఇటువంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ చోటుచేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఈ కేసు ఎంతో సెన్సిటివ్ కేస‌ని, ప్ర‌జాప్ర‌తినిధులు ఈ కేసులో ఉన్నారు కాబ‌ట్టి అన్ని అంశాల‌ను ప‌రిశీలించి ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన మరి కొందరు నిందితులను ప‌ట్టుకుంటామ‌ని, ఇటువంటి న‌కిలీ డాక్యుమెంట్ల కేసులు పెర‌గ‌కుండా పోలీసులు మ‌రింత స‌మ‌ర్థంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. నిందితుల‌ని రిమాండ్ కు త‌ర‌లిస్తామ‌ని చెప్పారు.

Comments