ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

పాకిస్థాన్ మ్యాచ్ లో బౌండరీ బాదితే ఆ మజానే వేరు.. కోచ్ గా ? : సెహ్వాగ్

ఒకప్పుడు తన క్రికెట్ ఆటతో భారత అభిమానులకు ఆనందాన్ని పంచిన మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రస్తుతం ట్విట్టర్ అనే గ్రౌండ్ లో మాటల బౌండరీలితో అలరిస్తున్నాడు. ఏ విధమైన సంఘటన జరిగిన తనదైన శైలిలో స్పందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గత కొంత కాలంగా టీమిండియా ప్రధాన కోచ్‌ పదవి కోసం సెహ్వాగ్ బరిలో ఉన్నాడని వస్తున్న వార్తలకు ఎట్టకేలకు ఈ మాజీ ఆటగాడు స్పందించాడు. యూసీ వెబ్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

ఆయన మాట్లాడుతూ.. తనకు కోచ్ గా బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టమేనని కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేశాడు. ప్రస్తుతం ప్లేయర్లతో ఆడిన అనుభవం తో పాటు, సచిన్ వంటి వారితో స్నేహం చాలా నేర్పించిందని అలాగే గంగూలీ సారథ్యంలో ఆడిన అనుభవం ఉందని తెలిపాడు. అలాగే సచిన్ తో బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు బౌండరీలను కొట్టడానికి ఊపొస్తుందని తెలిపాడు. మెయిన్ గా పాకిస్థాన్ పై ఫాస్ట్ గా ఆడటం లో మజా ఉంటుందని చెబుతూ.. 150 కి పైగా స్పీడ్ తో వేసే షోయబ్ అక్తర్ వంటి వారి బౌలింగ్ లో బౌండరీలు బాదడమంటే చాలా ఇష్టమని సెహ్వాగ్ చెప్పాడు.

Comments