ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

20 ఎకరాలలో..కనీవినీ ఎరుగని రీతిలో రామ్మోహన్ నాయుడు రిసెప్షన్..!

టిడిపి యువ నేత, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాజకీయ నాయకులంతా హాజరయ్యారు. కాగా ఈ నెల 18 న రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గత 10 రోజుల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 20 ఎకరాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాహడానికి రామ్మోహన్ నాయుడు ఏర్పాట్లు చేస్తున్నారట.

రామ్మోహన్ నాయుడి బాబాయ్ అయిన మంత్రి అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంగోలు అద్దంకికి చెందిన డెకరేషన్ బృందం గత పది రోజులుగా రిసెప్షన్ కార్యరంగానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడి స్వగ్రామం నిమ్మాడలో ఈ కార్యక్రమం జరగనుంది. వందేమాతరం శ్రీనివాస్ కు చెందిన టీంతో సంగీత కచేరి కూడా నిర్వహించనున్నారు. బాలకృష రామ్మోహన్ నాయుడి వివాహ వేడుకకు హాజరు కాలేదు. దీనితో ఆయన రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖులు భారీ గా ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో పోలీస్ లు తగిన స్థాయిలో భద్రత కల్పించనున్నారు.

Comments