దేశ రాజకీయాల్లో మరో సంచలనం.. తలైవాని దేవుడు శాసించేశాడు

దేశ రాజకీయాల్లో మరో అరుదైన ఘట్టం మొదలవ్వనుంది.. తమిళనాడు చరిత్రలో జనం మెచ్చిన ఓ స్టార్ పాలిటిక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. తైలవా మరి కొద్ది రోజుల్లో పార్టీని పెట్టబోతున్నాడని రజిని సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్ చెప్పేశారు.. దేవుడు ఇప్పుడు శాసించాడు అని ఆయన అభిమానులు అనుకుంటుంటే.. తమిళనాడు చిన్న పార్టీలు మాత్రం ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అక్కడి ప్రధాన పార్టీలు మాత్రం ఒక్కసారిగా షాక్ గురయ్యాయి. దేశంలోని ప్రధాన పార్టీలు కూడా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఎలా వుండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే రజినీకాంత్ తన పుట్టినరోజు సందర్బంగా డిసెంబరు 12 న అధికారికంగా పార్టీ పేరును ప్రకటించనున్నాడు.

Comments