ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

గంగూలీపై దాడి..పాక్ అభిమానుల సంస్కారం ఇదేనా..!

పాక్ అభిమానుల అత్యుత్సాహం మరో మారు ఆదేశ పరుగు పోయేలా చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ జట్టు ఫైనల్ చేరిన సందర్భంగా అభిమానులు మితిమీరి ప్రవర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాక్ జట్టు ఫైనల్ చేరిన అనంతరం భారత మాజీ కెప్టెన్ గంగూలీపై పాక్ అభిమానులు దాడికి పాల్పడ్డారు.

గంగూలీ ప్రయాణిస్తున్న కారుకి అడ్డుపడిన పాక్ అభిమానులు పెద్ద ఎత్తున పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసారు. గంగూలీ ప్రయాణిస్తున్న కారుని కదలనివ్వకుండా నిర్బంధించారు. దీనితో కారు దిగిన గంగూలీ పాక్ అభిమానులవైపు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. కొందరు అత్యుత్సాహపరులు కారు పైకి పాక్ జెండాలను విసిరారు. పాక్ అభిమానుల ఈ దుశ్చర్య ఆ దేశ పరువుని మరో మారు దిగజార్చిందనే చెప్పాలి. కాగా భారత్ – పాక్ జట్లు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో తలపడేందుకు సమాయత్తమవుతున్నాయి.

Comments