ప్రచురణ తేదీ : Tue, Jun 20th, 2017

మీరు చెప్పనట్టుగానే చేశాను కేసీఆర్ గారు : ప్రధాని మోడీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రధానమంత్రి మోడీకి జరిగిన సంభాషణ మారో సారి ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ అంటే అమితంగా ఇష్టపడే మోడీ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో కేసీఆర్ సలహానే పాటించారు. అందుకు కేసీఆర్ కి ఫోన్ చేసి మరి ఈ విషయాన్ని చెప్పారు ప్రధాని. మోడీ ఇంకా ఏమన్నారంటే..? ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతిగా ఎంపిక చేయాలన్న మీ మాట ప్రకారమే… ఓ దళిత నాయకున్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం. ఈ విషయాన్నీ మీకే ముందుగా చెబుతున్నాం. మీ మద్దతు మాకు తప్పకుండా ఇవ్వాలని కోరుతున్న. అని మోడీ కేసీఆర్ తో చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి తప్పకుండా మా మద్దతు మీకే ఇస్తామని చెబుతూ.. అనంతరం వెంటనే పార్టీ శ్రేణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాని చెప్పిన విషయాన్నీ వారితో చెప్పారు. అంతే కాకుండా మన మద్దతు తప్పకుండా వారికే ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ వార్త అందరిని ఆనందానికి గురిచేసింది. కేంద్రంతో స్నేహభావంతో మెలగడం రానున్న రోజుల్లో తెలంగాణకు మంచి పరిణామంగా మారే అవకాశం ఉంటుందని తెరాస పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు .

Comments