అమెరికాలో ఘోరం.. 3 ఏళ్ల కొడుకుతో సహా మృతి చెందిన గుంటూరు వాసి..!


అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన నాగరాజు(31) అతని 3 ఏళ్ల కుమారుడు దురదృష్టవ శాత్తు మరణించారు. దురదృష్టం వెంటాడడంతో అతడి కుటుంబం ఛిద్రమైంది.ఈ పెను విషాదం మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లాకు చెందిన నాగరాజు అమెరికాలోని మిచిగాన్ లో ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నారు. అతడు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లోని స్విమ్మింగ్ పూల్ లో తండ్రి కొడుకులు శవమై కనిపించడంతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. వెంటనే ఎమెర్జెన్సీ కి కాల్ చేసారు. వారు వచ్చి పరిశీలించగా నాగరాజు, అతని కుమారుడు అప్పటికే మరణించినట్లు తెలిపారు .స్విమ్మింగ్ పూల్ పక్కనే చిన్నారులు ఆడుకునే సైకిల్ కనిపించింది. దీనితో తన కొడుకుతో నాగరాజు ఆడుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదట అతని కొడుకు స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి ఉంటాడని, కొడుకుని కాపాడుకోవడానికి నాగరాజు కూడా స్విమ్మింగ్ పూల్ లోకి దిగి ఉంటాడని భావిస్తున్నారు. కానీ నాగరాజు మరణించేంత నీరు స్విమ్మింగ్ పూల్ లో లేవని కొందరు అంటున్నారు. ఈ కేసుకు సంబందించిన నిజానిజాలు విచారణలోనే తెలియాలి.

Comments