ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

కోదండరాం మరో షాకింగ్ నిర్ణయం.. రాజకీయాల కోసం .?

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రస్తుత ప్రభుత్వ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాలకుల తప్పుడు పాలనను త్వరలోనే ప్రజలకు తెలియజేసేలా చేస్తామని చెబుతూ.. జేఏసీ పై వస్తున్న విమర్శలకు సమాధానాన్ని ఇచ్చారు. తెలంగాణ నిర్మాణంలో సమగ్రమైన పాత్ర పోషించడమే జేఏసీ బాధ్యత అని కోదంరాం చెప్పారు. అలాగే తాను కూడా పార్టీ పెడుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. ప్రజల పక్షాన ఉండి సామాన్యుడిలా ప్రశ్నిస్తాను గాని రాజకీయల కోసం కాదని మీడియాతో చెప్పారు. అదే విధంగా జూన్ 21వ తేదీ నుండి నాలుగు రోజుల వరకు నిర్విరామంగా ‘అమరుల స్ఫూర్తి యాత్ర’ను చేపడుతున్నామని చెప్పారు. మొదట హైదరాబాద్ లో అమరులకు నివాళులర్పించి. ఆ తరువాత సంగారెడ్డి,జహీరాబాద్,నారాయణఖేడ్, అందోల్, నరసాపూర్ , మెదక్, దుబ్బాక ప్రాంతాల మీదుగా యాత్రను కొనసాగించి చివరగా సిద్దిపేటలో ముగిస్తామని టిజేఏసి సభ్యులు తెలిపారు.

Comments