ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

కేసీఆర్ హామీలు జెట్ స్పీడ్ లో.. ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. రీసెంట్ గా కేసీఆర్ కిట్టు పథకాన్ని ప్రారంభించి పేద మహిళల మన్ననలను పొందిన ఆయన మరిన్ని పథకాలతో సాధారణ ప్రజలకు దగ్గరవ్వాలని ఆలోచిస్తున్నారు. ఎలక్షన్ లు కూడా దగ్గర పడుతుండడంతో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలని మంత్రులతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ కేబినెట్ నాలుగు ఆర్డినెన్స్ లు జారీ చేసింది. పోలీస్ శాఖలో 26,296 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. అలాగే యాదవ కులానికి ఈ నెల 20న గొర్రెలను పంపిణి పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనితో పాటుగా ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు మత్య్స సంపదలో భాగస్వామ్యం తప్పకుండా కలిపించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది 40 కోట్ల మొక్కలను నాటలని ఇంతకుముందే నిర్ణయం తీసుకోగా వీలైనంత త్వరగా ఆ పనిని పూర్తి చెయ్యాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుంది.

Comments