ప్రచురణ తేదీ : Tue, Jun 20th, 2017

ఆన్ లైన్ లో పేకాట ఆడితే ఇక అంతే.. కేసీఆర్ సంచలన నిర్ణయం

ఒకప్పుడు పేకాట అంటే నిత్యం కోలాహలంగా ఉండే క్లబ్బులు కేసీఆర్ దెబ్బకి కనుమరుగై పోయాయి. కేసీఆర్ ఏ విషయాన్ని అయినా ఈజీగా తీసుకుంటారేమో గాని పేకాటను మాత్రం అస్సలు సహించరు. ఆయనకు ఆ మాట అంటేనే ఒక్కసారిగా కన్నెర్ర చేస్తారు. అయితే అప్పటినుండి పోలీసులు కూడా పేకాట ఆడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే పేకాట రద్దు చేసిన తరువాత ఈ మధ్య కొందరు టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు.

ఆన్ లైన్ పేకాట పై మక్కువ చూపిస్తున్నారు. అదే అనువుగా గ్యాంబ్లింగ్ చేసే సైట్లు కూడా లక్షలు గెలవచ్చని ఆశ చూపుతూ..కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. దీంతో కొందరు బాగా అలవాటు పడిపోయి డబ్బును పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా తెలుసుకున్న కేసీఆర్ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి అలంటి వాటిపై కూడా దృష్టిపెట్టాలని సైబర్ పోలీసులకు ఆదేశాలను జారీ చేశారు. అంతే కాకుండా ఆడే వారిపై కూడా కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. ఆన్ లైన్ లో పేకాట ఆడినట్లు తెలిస్తే మూడేళ్ళ జైలు శిక్ష తప్పదని గట్టిగా చెప్పారు.

Comments