భారతీయులు చెత్త మనుషులు… మేమేం చేసిన భరించండి.. లేదంటే చావండి…


ప్రపంచ దేశాల్లో భారతీయులను ఎంత అవమానాలకు గురిచేస్తున్నారో, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో ఈ మధ్య కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తుంది. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. దేశం మారిన భారతీయులపై జరుగుతున్నా దాడులు మాత్రం మారడం లేదు. భారతీయులకి కించపరుస్తూ వారు చేసి జాతి వివక్ష వాఖ్యలు ఆగడం లేదు. భారత జాతిని అవమానించే ఓ సంఘటన తాజాగా ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా లో చదువుకుంటూ టాక్సీ డ్రైవర్ గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న 25 ఏళ్ల ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి మీద ఆస్ట్రేలియా కు చెందిన కొందరు అమ్మాయిలు దాడికి పాల్పడ్డారు. ఆ అమ్మాయిలని కారులో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతం లో డ్రాప్ చేస్తున్న సమయంలో, ఫుల్ గా మధ్య సేవించి వున్న అమ్మాయిలు కారులో వాంతులు చేసుకున్నారు. అయితే, ఆ వాంతిని శుభ్రం చేయాల్సిందిగా వారు డ్రైవర్ గా చెప్పారు. అయితే అది తన బాద్యత కాదని, ఒక వేళ శుభ్రం చేయాలంటే అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుందని అతను చెప్పడంతో, మధ్య మత్తులో వున్న వారు ఒక్కసారిగా అతని మీద దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా భారతీయులు చెత్త మనుషులు, మేము ఎం చేసిన భరించాలి, లేదంటే చావాలి. అంటూ చెప్పడానికి వీలు లేని బూతులు తిట్టి దారుణంగా అవమానించి, స్పృహ కోల్పోయేలా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అక్కడ కొంత మంది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేసారు. అనంతరం దాడి గురించి తెలుసుకొని పోలీసులు కేసు నమోదు చేసారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరని తెలుసుకునే పనిలో పోలీసులు వున్నారు.

Comments