ఉల్లి కోసం అమెరికాలో లొల్లి.. బట్టలు విప్పేసి వీరంగం

మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వారి బంధువులు అమెరికాలో ఉన్నారంటూ గొప్పగా చెబుతుంటే.. నిజంగా చాలా ఉన్నతమైన వాళ్ళు అనుకుంటాం. కానీ కొందరు ఎన్నారై లు చేసే పనులు చూస్తే అసలు వీరికి తెలివి ఉందా అని అనుకుంటాం. అందుకు రీసెంట్ గా జరిగిన ఓ ఘటనే సాక్షం. వివరాల్లోకి వెళితే ఓక్లాండ్ (పిట్స్ బర్గ్) లో రవీందర్ సింగ్ అనే వ్యక్తి ఇండియన్ రెస్టారెంట్ ని నడుపుతున్నాడు. తరచు అక్కడికి చాలా మంది భారతీయలు వస్తుంటారు. అయితే యువరాజ్ అనే ఇండియన్ ఆ రెస్టారెంట్ లో చిన్న విషయానికి ఒక్కసారిగా పెద్ద గందరగోళాన్ని సృష్టించి. అక్కడి వారి చేత చివాట్లు తిన్నాడు.

ఆ హోటల్ లో తీసుకున్న ఆహారంలో ఉల్లిపాయలు వచ్చాయని గొడవకు దిగాడు అంతే కాకుండా అక్కడి వారితో దుర్భాషలాడి. రెస్టారెంట్ ఓనర్ పై కూడా చేయి చేసుకున్నాడు. అయితే అక్కడ ఉన్న కొందరు భారతీయులు సర్ది చెప్పడంతో రవీందర్ సింగ్ కూడా వెనక్కి తగ్గాడు. కానీ యువరాజ్ మరుసటిరోజు మద్యం సేవించి వాగ్వివాదానికి దిగాడు. అంతే కాకుండా చంపేస్తానంటూ బెదిరించడంతో రెస్టారెంట్ ఓనర్ పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువరాజ్ ని అదుపులోకి తీసుకుంటుండగా అతను అసభ్యంగా ప్రవర్తించాడు. బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడిపోయాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

Comments