ప్రచురణ తేదీ : Fri, Jun 16th, 2017

కుక్క ఎవరో తేలిందిగా..బంగ్లాకి కౌంటర్ వేస్తున్న ఇండియన్స్

బాంగ్లాదేశ్ క్రికెట్ ఆటలో చాలావరకు గుణపాఠాలు నేర్చుకుంది. తరువాత సమిష్ట కృషితో అంచలంచెలుగా ఎదుగుతూ.. ఛాంపియన్స్ ట్రోపీలో సెమి ఫైనల్ వరకు వెళ్లగలిగే జట్టని నిరూపించుకుంది. దీంతో ఆ దేశ అభిమానులు బంగ్లా ఆటగాళ్ల కృషికి మెచ్చుకున్నారు. కానీ గెలుపనేది అన్ని సార్లు ఒకే దగ్గర ఉండదు. ఎంత పెద్ద జట్టైనా ఓడిపోక తప్పదు. ఎదో వర్షం కారణంగా ఆస్ట్రేలియా నుంచి తపించుకున్న బంగ్లా అదృష్టవశాత్తు న్యూజిలాండ్ ని ఓడించి సెమి ఫైనల్ కి చేరింది. అయితే దొరికిందే ఆనందం అన్నటుగా కొందరు బంగ్లా అభిమానులు రెచ్చిపోయారు. మ్యాచ్ కి ముందు ఇండియాని అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ.. భారతీయులకు ఆగ్రహాన్ని తెప్పించారు.

అంతే కాకుండా ఓ కుక్కపై భారత జాతీయ పతాకం కప్పి ఉంచారు. దాని వెనకునే బంగ్లా జాతీయ పతాకం కప్పబడి ఉన్న టైగర్ వెంటాడుతూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కొంతమంది భారత అభిమానులు కూడా వారికి ధీటుగా సమాధానాన్ని ఇచ్చారు. కుక్క ఎవరో రేపు జరగబోయే మ్యాచ్ లో తెలుస్తుందని కౌంటర్ వేశారు. ఇక మ్యాచ్ లో బంగ్లా ఘోర పరాజయం చూడక తప్పలేదు. రోహిత్ సింహంలా బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో కుక్క ఎవరో తేలిపోయిందని ఇండియన్స్ కౌంటర్ వేస్తున్నారు.

Comments