భారత ఆటగాళ్లపై దాడులు తప్పవా? ధోని ఇంటికి ..?

మినీ వరల్డ్ కప్ గా చెప్పుకునే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత ఆటగాళ్లు కనీసం పోరాడకుండా ఓటమి పాలవడాన్ని క్రికెట్ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ లాంటి చిరకాల ప్రత్యర్థికి గట్టిపోటీని ఇస్తారనుకున్న ఆటగాళ్లు ఒక్కసారిగా చేతులెత్తాశారు. దీంతో భారత అభిమానులు ఈ ఓటమిని అస్సలు తట్టుకోలేక ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరు టీవీలను పగలగొట్టగా మరికొందరు భారత ఆటగాళ్ల దిష్టి బొమ్మలను తగలబెట్టారు. ఆయితే ఈ క్రమంలో భారత ఆటగాళ్ల ఇళ్లపై దాడి చేస్తారనే అనుమానంతో ముందుగానే ప్రభుత్వం సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ధోని ఇంటి వద్ద ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. 2014 లో ధోని నివాసాన్ని కొందరు ఆందోళన కారులు దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇంటిపై రాళ్లు విసిరి అద్దాలను పగులగొట్టారు. అదే విధంగా ఇప్పుడు మరికొంతమంది దాడి చేస్తారనే అనుమానంతో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా జార్ఖండ్ ప్రభుత్వం ధోని నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

Comments