ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ లో ప్రకటనలకు ధర ఎంతో తెలిస్తే షాక్ !

భారత్ – పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచ దేశాలు సైతం ఉత్కంఠతో ఎదురు చూస్తాయి. ఇరుదేశాల మధ్య కొన్నేళ్లుగా వాతావరణం అస్సలు బాలేదు. పాకిస్థాన్ వక్ర బుద్ధికి ఎన్ని సార్లు చివాట్లు పెట్టినా మారాదు. ఆ సంగతి పక్కనబెడితే భారత దేశ పౌరుషాన్ని చాటి చెప్పే ఓ అట రేపు మొదలవ్వనుంది. ప్రపంచ దేశాలన్నిటికి తెలుసు. భారత్ కి , పాకిస్థాన్ కి అస్సలు పడదని దీంతో ఈ మ్యాచ్ ఎలా జరగబోతుందోనని ప్రతి ఒక్కరు మ్యాచ్ ని వీక్షించడానికి ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అనువుగా చేసుకున్న స్పోర్ట్స్ ఛానెల్స్ లైవ్ మ్యాచ్ కి 30 సెకన్ల నిడివి ఉన్న ప్రకటనలకు కోటి రూపాయలను తీసుకుంటున్నారట. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఈ ఉత్కంఠ పోరులో ప్రకటనలు ఇవ్వడానికి పలు సంస్థలు పోటీ పడుతుండగా.. ఈ టోర్నీకి నిసాన్ మోటార్, ఇంటెల్ కార్ప్, ఎమిరేట్స్, ఒప్పో, ఎంఆర్ఎఫ్ కమర్షియల్ భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఇంతకుముందు జరిగిన మ్యాచ్ ల కంటే ఈ మ్యాచ్ కి ప్రకటన ధర 10 రేట్లు పెరిగిందట. ముఖ్యంగా ఈ మ్యాచ్ తో స్టార్ స్పోర్ట్స్ కు కాసుల వర్షం కురవనుంది.

Comments