ఆడదాని మీద అత్యాచారం చేయడం వారికి ఒక కల.! పైశాచికానికి పరాకాష్ట.?

సభ్య సమాజం తలదించుకునేలా అడుగడుగునా మగావాడి దురహంకారానికి ఆడది బలవుతూనే వుంది. ఆమెపై జరుగుతున్నా బలాత్కారం ఈ మధ్య మరీ బహిరంగం అయిపొయింది. ఎంత కాదనుకున్న తల్లి, చెల్లి, అక్క ఇలా ప్రతి ఇంట్లో ఒక ఆడది ఉంటూనే వుంది కాని మగాడి కామాదాహానికి అసలు ఈ అడ్డుగోడలు పడటం లేదు. అనాగరిక సమాజంలో ఆదిమానవుడు వంటి మీద వస్త్రం లేకుండా తిరిగిన పక్కనే ఉన్న ఆడదాన్ని అనుభావిన్చాలనే కోరికతో ఉన్నట్లు మనం ఎ చరిత్ర కథల్లో చదువుకోలేదు. కాని కాలం మారిన సమాజం నాగరికత వైపు అడుగులు వేసిన, ఒంటి మీదకి వస్త్రం వచ్చిన తర్వాత మగాడు కామాంధుడుగా మారి. అడిగాడుగున ఆడతనం మీద మోజు పెంచుకుంటున్నాడు. దాని కోసం హద్దులు దాటిపోయి, పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా అనుభవిస్తున్నాడు. అక్కడితో ఆగిపోకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ, అడ్డు తిరిగితే ఆమె ప్రాణం తీసేస్తూ, ఆ శవంపై పది తన కామావాంచ తీర్చుకుంటున్నాడు.

అయితే ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా జరుగుతున్నాయి. టెక్నాలజీ మగాడిని ఓ మృగంగా మార్చేస్తుంది. అందుబాటులో ఉన్న అశ్లీల ప్రపంచానికి బానిస అవుతున్న మగాడు. అభంశుభం తెలియని చిన్న పిల్లలని కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తాడు. ఆ క్షణం వాడు ఎ హోదాలో వున్న అనే విషయాన్ని మరిచిపోయి, ఓ మృగంలా మారిపోతున్నాడు. ఆడపిల్లలని అత్యాచారం చేస్తూ వాటిని సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నారు. ఆపై నగ్నంగా ఉన్న ఫోటోలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓ రకమైన శాడిజంతో కూడిన ఆనందాన్ని పొందుతున్నాడు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ పోలీస్ స్టేషన్ లో తండ్రి కళ్ళ ముందే పోలీసులు ఓ 12 ఏళ్ల చిన్నారిపై బలాత్కారం చేస్తున్న వీడియో సంచలనంగా మారిపోయింది. మరో చోట ఓ 10 యువకులు రోడ్డు మీద వెళ్తున్న తల్లికూతుళ్ళని వేదిస్తూ సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మరో చోట సామూహిక అత్యాచారం వీడియోలో నెట్ లో పెట్టారు. ఇంకో చోట బాలిక మీద అత్యాచారం చేస్తూ ఆ వీడియోని ఓ పోర్న్ సైట్ లో లైవ్ స్ట్రీం చేసాడు. ఇలా మగాడి దురాగతాలు మితిమీరిపోతునే ఉన్నాయి.

అయితే ఇలాంటి నేరాలు, ఘోరాల మీద వెంటనే స్పందించి సిక్షించాల్సిన చట్టం సంవత్సరాల తరబడి మానవ మృగాలని జైలు గోడల మధ్య పెట్టి పోషిస్తుంది. కొంత మంది పెద్దలు, తమ పలుకుబడితో ఎలాంటి అత్యాచారం చేసిన ఈజీగా తప్పించుకుంటున్నారు. న్యాయస్థానం కూడా కొన్ని సందర్భాల్లో అమ్ముడు పోయి అత్యాచారం జరిగిన అమ్మాయిని, వారి కుటుంబాన్ని మరింత చిత్రవధ చేస్తూ, నేరస్తులని సాక్ష్యాలు లేవని సాకు చూపిస్తూ సమాజంలోకి వదిలేస్తున్నాయి. దీంతో మ్రుగాడుగా మారిన మగాడికి మానవత్వం నశించిపోతుంది. ఆడది కనిపిస్తే అనుభవించిన తప్పులేదు అనే ఆలోచన పుడుతుంది. ఇలాంటి మానవ మృగాలకి నడి రోడ్డులో అందరి ముందు శిక్షించాలని చట్టం చేస్తే అప్పుడు వ్యవస్థలో కాస్తా అయిన మార్పు వచ్చే అవకాశం ఉండొచ్చు.

Comments