కారు ఇంజన్ దగ్గరికి ఎలా వెళ్ళింది ఆ పాము : వీడియో

కాస్త సందు దొరికినా పాములు దూరిపోతుండడం అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య పాములు ఎవరు ఊహించని విధంగా మానవుడు వాడే వస్తువులలోకి కూడా వెళుతున్నాయి. మొన్నటికి మొన్న ఏసీ లోకి దూరిన ఓ పాము ఇంట్లో వాళ్ళు చూస్తుండగానే ఓ ఎలుకను పట్టుకొని మళ్లీ ఏసీ లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మరో పాము ఏకంగా ఓ వాహనం ఇంజన్ లోకి దూరి కొందరిని ముప్పు తిప్పలు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. సౌత్‌వెస్ట్ చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌లోని ఓ కారు ఇంజన్ లో పది అడుగుల భారీ నాగుపాము దూరింది.

మొదట తోకను చూసి ఎదో చిన్న పాము అనుకున్నారు కానీ తోక పట్టి లాగితే ఎంతకీ రాకపోవడంతో ఓ సారి దగ్గరగా వెళ్లి పరిశీలించి చూస్తే.. అందరికి దిమ్మ తిరిగింది. దీంతో స్నేక్ క్యాచర్ ని పిలిపించి దాన్ని కష్టపడి బయటకి తీశారు. ఆ తరువాత ఓ సంచిలో వేయడానికి ప్రయత్నించగా ఆ భారీ పాము వారిని భయానికి గురిచేసింది. కొద్దీ సేపటి దాకా హల్ చల్ చేసిన ఆ పామును ఎట్టకేలకు పట్టుకొని అడవిలో వదిలేశారు. ఆ పాము ఏ విధంగా వారిని భయానికి గురి చేసిందో కింద ఇచ్చిన వీడియోలో చూస్తే మీకే అర్ధమవుతుంది.

Comments