ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

షాక్: అమ్మతనాన్ని అమ్మాకానికి పెట్టిన ప్రభుద్దులు?


సరోగసి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరికి భాగా పరిచయం వున్న పేరు. ఎవరో బిడ్డని వేరొక మహిళ కడుపులో 9నెలలు మోసి కనేసి తిరిగి వాళ్లకి ఇచ్చేస్తుంది. అయితే సరోగసి గర్భధారణ మీద తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు అంత అవగాహన లేదు. లేదు ఓ హాస్పిటల్ యాజమాన్యం అమ్మతాన్ని అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. తాగా ఈ కుంభకోణం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 సాయికిరణ్ హాస్పిటల్ యాజమాన్యం చట్టవిరుద్ధంగా సరోగసి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ హాస్పిటల్ మీద ఫిర్యాదు అందుకున్న పోలీసులు అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూసాయి. అధికారుల దాడుల సమయంలో మూడు వారల నుంచి 8 నెలల గర్భంగ్ ఉన్న మహిళలు ఉన్నారు. వారిని ఆరాతీయగా అసలు విషయాలు తెలిసాయి. సుమారు 48 మహిళలు డబ్బులు తీసుకొని గర్భం దాల్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. సరోగసి మీద అవగాహన లేని మహిళలకు డబ్బు ఆశ చూపించి ఏటా 50 మహిళలతో పిల్లలు కనిపిస్తూ, లక్షల్లో పిల్లలు లేని తల్లిదండ్రులతో కాంట్రాక్టు చేసుకొని డబ్బులు గడిస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

Comments