ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. షాకింగ్ వీడియో..!

ప్రమాదాలు సాధారణంగా జరిగితే భయమేస్తుంది. అలాంటిది జరిగిన ప్రమాదం భయంకరంగా ఉంటే..ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇలాంటి ఘటనే అమృత్ సర్ సమీపంలో జరిగింది. అనూహ్యంగా జరిగిన ఈ యాక్సిడెంట్ భయంకరంగా ఉంది. ఒకటో నెంబరు జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి ఇరువైపులా వాహనాలు వేగంగా వెళుతున్నాయి. అదుపు తప్పిన ఓ కారు వేగంగా డివైడర్ ని ఢీకొట్టి ఇవతలి వైపుకు వచ్చేసింది. ఢిల్లీ వైపుగా వెళుతున్న మరో కారు దానిని ఢీకొట్టడంతో ఘోరమైన ప్రమాదం జరిగింది.

ఢిల్లీ వైపుగా వెళుతున్న కారులో రితీష్ అనేవ్యక్తి ముగ్గురు కుటుంబసభ్యలు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి కారణమైన కారుడ్రైవర్ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకున్న తరువాత అరెస్టుకు పోలీస్ లు రంగం సిద్ధం చేశారు. మద్యం తాగిన డ్రైవర్ రాజిందర్ సింగ్ వాహనం నడపడం వలనే ఈ ప్రమాదం జరిగిందని పోలీస్ లు భావిస్తున్నారు. ఈ ప్రమాద వీడియో సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది.

Comments