ఆపిల్ కి దీటుగా గూగుల్ ప్లాన్.. ఏకంగా ఆ ఉద్యోగిని లాగేసుకుంది

ప్రపంచంలో ఎన్ని స్మార్ట్ ఫోన్లు వస్తున్నా నాణ్యతలో ఐఫోన్లను మాత్రం మించలేకపోతున్నాయి. అంతే కాకుండా అందులోని స్మార్ట్ ఫీచర్స్ ని కూడా ఏ మొబైల్ ఫోన్లు క్రియేట్ చేయలేకపోతునన్నాయి. దీంతో ఇప్పటివరకు ఐఫోన్ దిగ్గజాన్ని ఎదురు ఎవ్వరు లేరు అనుకున్న తరుణంలో ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కంపెనీ ఈ మద్యే తీవ్ర స్థాయిలో ఆపిల్ ని మించిన స్థాయి ఫీచర్స్ అందించాలని చూస్తోంది.

ఇందుకోసం ఏకంగా ఆపిల్ లో పని చేసే ఉద్యోగినే లాగేసుకుంది. ఈ మధ్యనే తన సొంత బ్రాండులో పిక్సెల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న గూగుల్ ఈ సారి ఐఫోన్ కి ధీటుగా ఓ ఫోన్ ని తయారుచేస్తోంది. ఫ్లాగ్ షిప్ పిక్సెల్ ఫోన్ కోసం ఐఫోన్ల, ఐప్యాడ్ ల చిప్ ఆర్కిటెక్ట్ ను గూగుల్ తీసేసుకుంది. భారత సంతతికి చెందిన ఇంజనీర్ గులాటి గత ఎనిమిదేళ్లుగా ఆపిల్ లో మైక్రో- ఆర్కిటెక్ట్ గా పనిచేశాడు. దీంతో ఈ ప్లాన్ గనక వర్కవుట్ అయ్యి ఫోన్లు భారీగా అమ్ముడుపోతే ఇక ఐఫోన్ వాల్యూ తగ్గినట్టేనాని అంటున్నారు నిపుణులు.

Comments