ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

మోడీకే లొంగలేదు.. బాబు మాట వింటుందా..!


రాష్ట్రపతి అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించారు మోడీ. కాగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దత్తు కూడగట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు ఆయన వరుసగా కేసీఆర్, చంద్రబాబు, పళని స్వామి లకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దత్తు తెలపాలని కోరగా కేసీఆర్ వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు ఎలాగూ ఎన్డీయేలో భాగస్వామే.ఎన్డీయేలో లేని కొందరు ముఖ్యమంత్రులను బిజ్జగించే బాధ్యతని మోడీ చంద్రబాబుకు అప్పగించారట. వెంకయ్య నాయుడు, చంద్రబాబు లు ఇద్దరూ కలసి ఎన్డీయే అభ్యర్థికి మద్దత్తు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు మొదట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఫోన్ లో సంప్రదించారట. కానీ ఆమె నుంచి ఆశించిన స్థాయిలో సమాధానం రాలేదట. మమతా బెనర్జీ బిజెపి వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మమతా విమర్శించినంతగా మోడీని మరెవరూ విమర్శించలేదు. ఆమె విమర్శలకు అడ్డుకట్ట వేయడం మోడీ వలెనే కాలేదు. ఇక ఆమె ఎన్డీయే అభ్యర్థికి మద్దత్తు తెలుపుతుందని ఆశించడం అత్యాశే. అయినా కూడా చంద్రబాబు ఓ ప్రయత్నంగా మమతకు ఫోన్ చేశారట. తాను ప్రస్తుతం నెదర్లాండ్ పర్యటనలో ఉన్నానని తిరిగి వచ్చాక ఈ విషయం గురించి మాట్లాడతా అని చంద్రబాబుకు మమతా చెప్పినట్లు తెలుస్తోంది.

Comments