రివ్యూ ‘రాజా’ తీన్‌మార్ : ధృవ – రీమేక్ తో వచ్చినా.. రామ్ చరణ్ రఫ్ఫాడించాడు !!

dhruva
తెరపై కనిపించిన వారు : రామ్ చరణ్, అరవింద స్వామి, రకుల్ ప్రీత్

కెప్టెన్ ఆఫ్ ‘ధృవ’ : సురేందర్ రెడ్డి

మూల కథ :

ధృవ (రామ్ చరణ్), అతని స్నేహితులు ఐపీఎస్ ట్రైనింగ్ లో సీక్రెట్ గా సిటీలో జరిగే క్రైమ్స్ ని అరికడుతూ నేరస్థుల్ని పోలీసులకు పట్టిస్తూ ఉంటారు. అలా వాళ్ళు పోలీసులకు అప్పగించిన నేరస్తుల్లో ఒకడు సులభంగా తప్పించుకుని బయట తిరగడం గమనించిన ధృవ, అతని స్నేహితులు అదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తుండగానే ధృవ ఎన్నాళ్లగానో తను రీసెర్చ్ చేస్తున్న ఒక టాపిక్ గురించి చెప్పి, దాన్ని సాల్వ్ చేసి ఈ చిన్న చిన్న నేరాలన్నింటికీ కారణమైన పెద్ద క్రిమినల్ ని పట్టుకోవాలన్నదే తన లక్ష్యమని ఆ క్రిమినల్ కోసం వెతుకుతూ అరవింద స్వామికి కనెక్టవుతాడు. అసలు సిద్దార్థ అభిమన్యు ఎవరు ? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? అతనికి, ధృవకి మధ్య ఫైట్ ఎందుకు మొదలైంది ? అది ఎలా సాగింది ? ఆ ఫైట్ లో చివరికి ఎవరు, ఎలా గెలిచారు ? అన్నదే సినిమా

విజిల్ పోడు :
–> సినిమాలో మొదట విజిల్ వేయాల్సింది కథకి. ఒక పోలీస్ కు ప్రస్తుత ట్రెండీ కి తగ్గట్టు స్టైలిష్ కథను, మైండ్ గేమ్ తో నడిచే అద్భుతమైన కథనాన్ని జోడించి సినిమాగా తీయడం చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు కథ పరంగా ఒక సంతృప్తి అనేది మైంటైన్ అవుతూ వచ్చింది. కనుక కథకు ఒక విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక సినిమా ఫస్టాఫ్ మొత్తం చాలా వేగంగా నడుస్తూ ఎప్పుడు అయిపోయిందో కూడా తెలీదు. రామ్ చరణ్ నటన బాగానే ఉన్నా, అరవింద స్వామి నటన గొప్పగా ఉన్నాయి. రెండో విజిల్ వీరిద్దరికీ వెయ్యొచ్చు.

–> పరెషానురా.. పాటలో రకుల్ ప్రీత్ గ్లామర్ షో, చివరి పాట నీతోనే డ్యాన్స్.. లో చరణ్ స్టెప్పులు, హిపాప్ తమిజా సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నే పర్ఫెక్ట్ గా కుదిరి చాలా బాగున్నాయి. మూడో విజిల్ వీటన్నిటికీ కలిపి వెయ్యొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> ఇక సినిమా సెకండాఫ్ రన్ టైమ్ కాస్త ఎక్కువగానే అనిపించింది. అక్కడక్కడా కథనం నెమ్మదించి కాస్త సాగదీసినట్టు తోచింది.

–> కథలో వచ్చే కొన్ని హెవీ లాజికల్ సీన్స్ అంటే అభిమన్యు ఏంజెలినాను చంపడానికి వేసిన ప్లాన్, అది వర్కవుట్ కాకూండా ధృవ ఆపడం వంటి వాటిని అర్థం చేసుకోవడానికి సామాన్య ప్రేక్షకుడికి ఎక్కువ సమయమే పడుతుంది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా.. !

–> ధృవ ఇన్వెస్టిగేషన్ సందర్భంలో ఒక పెద్ద ఫ్యాక్టరీలో తన ఫ్రెండ్ వాచ్ కనిపెట్టాల్సిన పరిస్థితి వస్తే కేవలం కళ్ళు మూసుకుని శబ్దం విని తెలుసుకుంటాడు. అంట పెద్ద ఫ్యాక్టరీలో ఆ చిన్న శబ్దం ఎలా అనిపించిందో అర్థం కాదు.

ఇక సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఏరా నువ్వు తమిళ్ వర్షన్ చూశావుగా.. ఇది ఎలా అనిపించింది ?
మిస్టర్ బి : నాకైతే బాగానే అనిపించింది. చరణ్ చాయిస్ బాగుంది. మరి నీకు ?
మిస్టర్ ఏ : నేను తమిళ్ వర్షన్ చూడలేదు కదా ఛాయా బాగుందనిపించింది.
మిస్టర్ బి : మొత్తానికి రీమేక్ వచ్చినా.. రామ్ చరణ్ రఫ్ఫాడించాడన్నమాట.
మిస్టర్ ఏ : అంతేగా మరి.

Comments