మొసలి నోట్లో తలకాయ పెడితే ఎలా ఉంటుంది?: వీడియో

మానవుడు తలచుకుంటే ఏ జంతువుతో నైనా విన్యాసాలు చేయగలడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కొన్ని క్రూర మృగాలు రోజు ఉన్నట్లు ఉండలేవు. రోజులాగే విన్నట్టే విని ఒక్కసారిగా దాడి చేస్తాయి. అయితే ఓ వ్యక్తి చేసిన సాహసం అతని ప్రాణాలకే ముప్పు తెచ్చింది. చూస్తున్న వారికి కూడా ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. వివరాల్లోకి వెళితే.. థాయ్లాండ్లోని కోహ్ సముయ్ ప్రాంతంలో ఓ జూ ఉంది.

అయితే అక్కడ నిర్మించిన కృతిమ కొలనులో ఓ ముసలితో రోజు లాగే ఓ వ్యక్తి విన్యాసం చేశాడు. మొసలి తో కొద్దీ సేపు సైగలతో అలరించి ఆ తరువాత అది నోరు తెరవగానే దాని నోట్లోకి తలకాయ ఉంచాడు. అప్పటి వరకు బాగానే ఉన్న మొసలి అతను కరెక్ట్ గా తలను తీసే సమయానికి ఒక్కసారిగా నోటితో కరిచింది. ఆ తరువాత దానికి ఏమనిపించిందో ఏమో గాని అతని అదృష్టం బావుండి వదిలేసి నీళ్ళలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆ వ్యక్తి గాయాలతో తప్పించుకున్నాడు. ఒక్కసారిగా షాక్ గురి చేసే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Comments