ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

అఖిల ప్రియ వెనుక భారీ కుట్ర..?

సెంటిమెంట్ అనేది రాజకీయాల్లో కలసి వస్తుంది. అదే మహిళ అయితే దానిప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2014 ఎన్నికల కొన్ని నెలల ముందు వరకు దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ సెంటిమెంట్ జగన్ పట్ల ప్రజల్లో బలంగా కనిపించింది. కానీ మారిన పరిస్థితులను ఎన్నికల వేళ చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. జగన్ సెంటిమెంట్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బలంగా పనిచేసిందనే విషయం వాస్తవం..లేకుంటే జగన్ అధికారంలోకి వచ్చేవారని వైసిపి నేతలే స్వయంగా చెబుతారు. వైసిపి 67 సీట్లవరకు దక్కించుకోగాలింగిందటే అది వై ఎస్ సెంటిమెంట్ వలనే. కాగా ఇప్పుడు అదే సెంటిమెంట్ తో భూమా అఖిలప్రియ రాజకీయాల్లో ఎదుగుతోంది.

ఆమె ఎదుగుదలని సహించలేని వారు అఖిలప్రియ వెనుక కుట్ర పన్నుతున్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి. అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి కారుప్రమాదంలో మరణించగా, ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి ఇటీవల గుండె పోటుతో మరణించారు. దీనితో ఆమెకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. భూమా ప్రాతినిధ్యం వహించిన నంద్యాల ఉపఎన్నిక కేంద్రంగా పెద్ద రాజకీయమే జరుగుతోంది. రాజకీయంగా అఖిలప్రియని అణగదొక్కాలనే కుట్ర తెరవెనుక జరుగుతున్నట్లు టిడిపి వర్గాలు, ఆమె అనుచరులు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సెంటిమెంట్ ని ఆధారం చేసుకుని అఖిలప్రియ కర్నూలు రాజకీయాల్లో మరింత బలంగా మారితే తమకు ప్రమాదమని భావిస్తున్న కొందరు ఆమెని చంద్రబాబు దృష్టిలో దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూమా కుటుంబానికి శిల్పా కుటుంబానికి పడదనే విషయం బహిరంగ రహస్యమే.

నంద్యాల ఉపఎన్నిక టికెట్టు తనకుటుంబానికే దక్కాలని అఖిలప్రియ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనితో తనకు ఇకరాజకీయ భవిష్యత్తు ఉండదని భావించిన శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరిపోయారు. తన కుటుంబంలోని వ్యక్తిని నంద్యాల ఉపఎన్నికలో నిలబెడితే సెంటిమెంట్ కలసి వస్తుందనేది అఖిల ప్రియా ఆలోచనగా చెబుతున్నారు. భూమా మరణంతో ఆ తరువాతి స్థానం జిల్లాలో తమకే దక్కాలని భావిస్తున్న కొందరు అఖిలప్రియని పార్టీలో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారనేది ఆమె అనుచరుల వాదన. ఆమె చుట్టూ నెలకొన్న సెంటిమెంట్ ని తొలగించి నంద్యాల స్థానాన్ని కైవసం చేసుకోవాలని వైసిపి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ వైసిపి వ్యూహాలలో భాగమైనా ఆశ్చర్యపోనవసరం లేదని టిడిపి వర్గాలు చెబుతున్న మాట. భూమా కుడి భుజంగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి అఖిల ప్రకియకు ఎదురు తిరగడం, తనకు జగన్ పార్టీ నుంచి ఆఫర్ ఉందని ప్రకటించడం వంటివి అఖిల ప్రియని రాజకీయంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమని భూమా వర్గంలోని వారు చెబుతున్నారు.

Comments