సీఎం కోడలిని నీడలా వెంటాడుతున్నది ఎవరు..?


కర్ణాటక ముగుఖ్యమంత్రి సిద్ద రామయ్య కోడలు స్మిత రాకేష్ బెంళూరు పోలీస్ లను ఆశ్రయించిన వార్త అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా తన ఇంటి చుట్టూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నారని, వారు ఎవరు, అలా ఎందుకు చేస్తున్నారనే విషయం అర్థం కావడం లేదని స్మిత రాకేష్ పోలీస్ లకు తెలిపారు. రోజు రోజుకు తమ ఇంటి బయట వారి సంచారం ఎక్కువడడంతో భయమేస్తుందని ఆమె పోలీస్ లకు తెలిపారు. తమకు తగిన భద్రత కల్పించాలని ఆమె పోలీస్ లకు కోరినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కోడలికే భద్రత లేని విషయం కర్ణాటకలో సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కుమారుడు, తన భర్త అయిన రాకేష్ మరణించిన తరువాత ఆమె తన తల్లి నివాసంలో కొడుకు ధ్యాన్, కూతురు తన్మయి లతో కలసి ఉంటోంది. సిద్ద రామయ్య పెద్ద కుమారుడు అయిన రాకేష్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్మిత బెంగుళూరు మల్లేశ్వరంలో నివాసం ఉంటోంది. గత మూడు రోజులుగా గుర్తు తెలియనికొందరు దుండగులు తమ కాంపౌండ్ చుట్టూ తిరుగుతూ భయపెడుతున్నారని ఆమె పేర్కొంది. దీని వలన తమకు నిద్ర కరువవుతోందని ఆమె పేర్కొంది.

Comments