ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

వాట్ ఎ టైమింగ్..బాబు పై సోషల్ మీడియాలో సెటైర్లు !


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎంత చురుకుగా ఉంటాయో మరో మారు వెల్లడైంది. నంద్యాల ఉప ఎన్నిక అటు అధికార పక్షానికి ఇటు విపక్షానికి ముఖ్యమే. ఈ ఎన్నిక ద్వారా 2019 ఎన్నికల్లో ప్రజల నాడి ఇప్పుడే పసిగట్టవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వా పనితీరుకు, వైసిపి పోరాటాలకు ఈ ఉపఎన్నికని రెఫరెండంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో ఏ పార్టీకి అధిత్యధిక ఓటు బ్యాంకు ఉందనే లెక్కలు మొదలైపోయాయి. ఈ లెక్కలను బేరీజువేయడంలో అందరికన్నా చంద్రబాబు ముందంజలో ఉన్నారు. నంద్యాలలో దాదాపు 65 వేల ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ విషయాన్ని పసిగట్టిన బాబు ఆ దిశగా ముస్లింలను ఆకర్శించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం ప్రతిసారి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందుని అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ సారి ఇఫ్తార్ విందుని నంద్యాలలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇది రంజాన్ పండుగ సందర్భం కావడం, నంద్యాలలో అత్యధికంగా ముస్లింలు ఉండడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఏమి టైమింగు బాబు అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబుపై కామెంట్లు పడుతున్నాయి. నంద్యాలలోని ముస్లిం పెద్దలందరిని ఇఫ్తార్ విందుకు ఆహ్వానించి బై ఎలక్షన్ కు మైలేజి ని సంపాదించొచ్చనేది బాబు ఆలోచన.

Comments