రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎల్.కె. అద్వానీ? ఫైనల్ చేసినట్టేనా ?


బీజేపీ కురువృద్ధుడు, ఉక్కుమనిషి ఎల్.కె. అద్వానీకి పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజుల తర్వాత సముచిత స్థానం ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు అమిత్ షా సిద్ధమయినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరనే విషయం మీద వచ్చిన ఊహాగానాలకి తెరదించుతూ బీజేపీ ప్రభుత్వం ఎల్.కె. అద్వానీని రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టేందుకు సిద్ధమయినట్లు ఇప్పుడు వార్త వినిపిస్తుంది. ఎంతో మంది పేర్లను పరిశీలించిన బీజేపీ అధిష్ఠానం… చివరకు ఆ పార్టీ కురువృద్ధుడు అద్వాణీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్టు సమాచారం. కాసేపట్లో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అభ్యర్ధి ఖరారు అవుతుందని తెలుస్తుంది ఆ సమావేశం లోనే రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వాణీ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, బీజేపీ కీలక నేతలంతా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు.

Comments