ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

జగన్, చంద్రబాబు ఇద్దరికీ.. ఎంత రాజకీయం జరుగుతోంది..?


నంద్యాల ఉపఎన్నిక అధికార, ప్రతిపక్షాలకు తల బొప్పి కట్టేలా చేస్తోంది. నంద్యాల అభ్యర్థి కోసం తర్జన భర్జన పడిన టిడిపి ఎట్టకేలకు భూమా కుటుంబానికి చెందినబ్రహ్మానందారెడ్డిని బరిలో నిలపడానికి సిద్ధమవుతోంది. తనకు నంద్యాల ఉపఎన్నిక టికెట్టు ఇవ్వడం లేదని అలక వహించిన శిల్పా మోహన్ రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. దీనితో నంద్యాల స్థానంలో రాజాకీయ వేడి పెరిగింది. తెలుగు దేశం పార్టీ ఓ వైపు ఉపఎన్నికకు సిద్దమవుతూనే మరో వైపు ఉపఎన్నికని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ బాధ్యతని ఉప ముఖ్య మంత్రి కేఈ కృష్ణ మూర్తి, కాల్వ శ్రీనివాస్ లకు అప్పగించినట్లు తెలుస్తోంది.

అటు వైసిపిలో కూడా శిల్పా మోహన్ రెడ్డిని నంద్యాల అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉనట్లుతెలుస్తోంది. గంగుల ప్రతాప్ రెడ్డి తోపాటు రాజగోపాల్ రెడ్డి కూడా ఈ స్థానం ఆశలు పెట్టుకుని ఉన్నారు. దీనితో జగన్ కు కూడా చిక్కులు తప్పవని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏకగ్రీవ ప్రతిపాదనని జగన్ అంగీకరిస్తారా లేక సమారానికే సై అంటారా అనే విషయం ఆసక్తిగా మారింది. ఉపఎన్నికని ఏకగ్రీవం చేయడం కోసం బ్రహ్మానందా రెడ్డి స్వయంగా జగన్ ని కలిసినా ఆశ్చర్యం అవసరం లేదనే ప్రచారం జరుగుతోంది. పైకి ఉపఎన్నిక లాగే కనిపిస్తున్నా దీనివెనుక భారీ స్థాయిలో రాజకీయం జరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం.

Comments