ప్రచురణ తేదీ : Fri, Jun 16th, 2017

శిరీష ఆత్మహత్య కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి.. ఆమెను ఆ రాత్రి ?

గత కొన్ని రోజులుగా నగరంలో సంచలనాన్ని సృష్టిస్తున్న శిరీష , ఎస్సై ప్రభాకర్ ల మరణాలు ఎట్టకేలకు ఓ నిర్దారణకు వచ్చాయి. రీసెంట్ గా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ ఈ కేసుపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు అయితే ఈ కేసులో శ్రవణ్ , రాజీవ్ అనే యువకులను ఏ1 ,ఏ2 ముద్దాయిలుగా వారు పరిగణించారు.కమిషనర్ మహేందర్ రెడ్డి ఈ కేసులోని కొన్ని కీలక విషయాలను అలాగే శిరీష చనిపోవడానికి ముందు జరిగిన కొన్ని విషయాలను విలేకరులకు తెలియజేశారు.

గొడవ ఇలా స్టార్ట్ అయ్యింది..

పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. వల్లభనేని రాజీవ్ కుమార్ అనే విజయవాడకు చెందిన వ్యక్తి ఆర్ జే ఫోటోగ్రఫి పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అయితే అతని స్టూడియోలో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్న శిరీష అతనికి బాగా దగ్గరయింది. అయితే రాజీవ్ కు మాత్రం తేజస్విని అనే అమ్మాయితో ఫెస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పరచుకొని ప్రేమలో పడేశాడు. దీంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తేజస్వి మూడు నెల క్రితం నగరానికి వచ్చింది. వచ్చిన తరువాత తేజస్వి శిరీష కు, రాజీవ్ కు ఉన్న సంబంధం గురించి తెలుసుకొని ఇద్దరిని నిలదీయడంతో ముగ్గురు మధ్య వాగ్వివాదాలు జరిగాయి. దీంతో తేజస్వి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. ఆ తరువాత రెండురోజులకే కేసును కొట్టివేయాలని మేము పరిష్కరించుకుంటామని చెప్పింది.

గొడవ సిద్ధిపేట ఎస్సైకి చేరింది..

అయితే ఈ జరిగిన విషయాన్ని శిరీష తన సన్నిహితుడైన శ్రవణ్ అనే వ్యక్తికి తెలిపింది. అయితే శ్రవణ్ ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే వెళ్ళేటప్పుడు వారు మద్యం బాటిళ్లను తీసుకువవేళ్లారు. అక్కడే పోలీస్ క్వార్ట్రర్స్ లోనే కూర్చొని మద్యం కూడా సేవించారు. ఆ సందర్భంలో వారు సమస్య గురించి ప్రస్తావించినప్పుడు శిరీష, రాజీవ్ లు ఇద్దరు ఒక్కసారిగా కోపానికి లోనవ్వడంతో శ్రవణ్ , రాజీవ్ ను బయటకి తీసుకెళ్లాడు. అయితే అక్కడే ఉన్న ఎస్సై శిరీష ఒంటరిగా ఉండడాన్ని చూసి ఆమెపై అత్యాచారాన్ని చేయబోయాడు. దీంతో ఆమె గట్టిగా అరవడంతో రాజీవ్, శ్రవణ్ లు లోనికి వెళ్లారు. అయితే శిరీష వారిపై ఆగ్రహించడంతో ఆ గొడవలో రాజీవ్ ఆమెపై దాడి చేశాడు. ఆ తరువాత ఉదయాన్నే అందరు హైదరాబాద్ కు బయలుదేరగా దారి మధ్యలో కూడా వారి మధ్య కొంత సంఘర్షణ ఏర్పడింది. ఆ సమయంలో శిరీష మొహం మీద రాజీవ్ దాడి చేయడంతో ఆమె పెదవులపై గాయాలు అయ్యాయి.

చనిపోయిన రోజు..

ఉదయాన్నే హైదరాబాద్ కు చేరుకున్నకా శిరీష ఇంటికి వెళతానని చెప్పి రాజీవ్ స్టూడియో లోకి వెళ్ళింది. ఎంతసేపైనా కిందకు రాకపోవడంతో ఆ ఇద్దరు వెళ్లి చుశారు. అయితే శిరీష డోర్ తీయకపోవడంతో శ్రవణ్ వెళ్ళిపోయాడు. ఆ తరువాత రాజీవ్ కూడా వెళ్లిపోవాలని అనుకుంటుండగా మరో సారి స్టూడియో లోకి వెళ్లి చూశాడు అయితే అప్పటికే శిరీష ఉరేసుకొని ఉంది. అయితే ఆమె ఆత్మహత్యకు ముందు రాజీవ్ కు వీడియో కాల్ చేసింది కానీ అతను స్పందించలేదు. ఈ క్రమంలో శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని శ్రవణ్ కి ఫోన్ చేశాడు రాజీవ్. అయితే అపోలో నుంచి ఓ డాక్టర్ ని తెప్పించి చూపించగా ఆమె అప్పటికే మరణించిందని తెలిసింది. దీంతో సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి కేసును నమోదు చేసి శిరీష భర్తకి సమాచారాన్ని ఇచ్చారు.

అయితే ఈ గొడవలో కీలకంగా చెప్పుకున్న ఎస్సై పాత్ర ఏమైనా ఉండవచ్చునని పొలిసు అధికారులు పలు మార్లు ఎస్సై ప్రభాకర్ ని ప్రశ్నించడంతో అతను ఈ నెల 14 న రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మరొక ముఖ్యమైన విషమేమిటంటే ఈ కేసులో రాజీవ్ ప్రేయసి తేజస్విని విచారించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను కూడా విచారించాలని శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిది ఆత్మహత్యేనని నిర్థారించిన పోలీసులు మరిన్ని వివరాలను ఇంకా సేకరించాల్సి ఉందని చెప్పారు.

Comments