ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

ల్యాంకో హిల్స్ సీజ్‌? పాపం రాజ‌గోపాల్ ఏమవ్వాలి?

బిజినెస్ టైకూన్‌.. ఇండ‌స్ట్రియ‌లిస్ట్‌.. రాజ‌కీయ నాయ‌కుడు .. ల్యాంకో హిల్స్ అధినేత రాజ‌గోపాల్‌కి అదిరిపోయే పంచ్ ప‌డ‌బోతోంది. అత‌డి అప్పుల‌కు సంబంధించి చెల్లింపులు జ‌ర‌గ‌నందున అత‌డిపై ఎటాక్‌కి బ్యాంకులు రెడీ అవుతున్నాయ‌న్న వార్త అందింది.

భారీగా రుణాలు తీసుకుని భారీ భ‌వంతులు, ఆకాశ హార్మ్యాలు నిర్మించిన ల‌గ‌డ‌పాటికి రాష్ట్ర విభ‌జ‌న రూపంలో భారీ పంచ్ ప‌డింది. హైద‌రాబాద్‌లో ల‌గ‌డ‌పాటి ట‌వ‌ర్స్ నిర్మాణం మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అయితే చాలా చోట్ల ల‌గ‌డ‌పాటి వ్యాపారాలు స‌జావుగానే సాగుతున్నా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించ‌కుండా టోక‌రా వేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఆ మేర‌కు బ్యాంకులు ప‌లుమార్లు నోటీసులు పంపించాయి. ఎట్ట‌కేల‌కు రాజ‌గోపాల్ మెడ‌లు వంచి అప్పు వ‌సూలు చేసేందుకు బ్యాంకులు నిర్ణ‌యించుకున్నాయ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఇలా చేస్తే పాపం రాజ‌గోపాల్ ఏం కావాలి? మ‌రోసారి హైబ‌ర్‌నేష‌న్‌కి వెళ్లిపోతాడా.. ఎవ‌రికీ క‌నిపించ‌కుండా.. అండ‌ర్ గ్రౌండ్ వెతుక్కుంటాడా? అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగితే రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని ప్ర‌క‌టించి ఆ ప‌ని తూ.చ త‌ప్ప‌కుండా చేశాడు. మ‌ళ్లీ చాలా కాలానికి ఏపీ సీఎం చంద్ర‌బాబును పొగిడేస్తూ స‌ర్వేలు చేశాడు. మొత్తానికి మ‌రోసారి బ‌య‌టికి క‌నిపించ‌కుండా అండ‌ర్‌గ్రౌండ్ కి వెళ్లాల్సిన సీనే క‌నిపిస్తోంది.. ప్చ్‌!!

Comments