అమెరికాలో మరో భారతీయుడిపై దాడి

అగ్రరాజ్యంమైన అమెరికాలో మారో దారుణం చోటుచేసుకుంది. రీసెంట్ గా ఓ ముస్లిం భారతీయుడిపై జారిగిన ఘటన మరువకముందే మరో భారతీయుడిపై దుండగులు కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళితే గుజరాత్‌కు చెందిన హస్‌ముఖ్ పటేల్(24) మూడు సవత్సరాల క్రితం అమెరికాకు వెళ్ళాడు. అయితే అట్లాంటాలోని ఒక స్టోర్‌లో పనిచేస్తున్న అతనికి సోమవారం రాత్రి చేదు అనుభవం ఎదురైంది.

రాత్రి కావోస్తుండడంతో స్టార్ ను మూసివేస్తున్న అతనిపై కొందరు దుండగులు దాడి చేసి దొంగతనానికి పాల్పేడేందుకు ప్రయత్నించరు.. హస్‌ముఖ్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దుండగులు అతనిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడిని అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ యువకుడి తల్లిదండ్రులకు విషయం తెలియగానే షాక్ కి గురయ్యారు. వెంటనే అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు పాట్నా సమీపంలోని సుంథేర్ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments