ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

కేంద్రం నుంచి కేసీఆర్ కి కృతజ్ఞత లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం సహరించినందుకు కేసీఆర్ కు కేంద్రం ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అరుణ్ జైట్లీ లేఖ రాశారు. దీంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి మరింత దగ్గరయినట్టు తెలుస్తోంది. మొదట కొన్ని పార్టీలు జీఎస్టీ బిల్లుకు వ్యతిరేకత తెలిపిన ఆ తరువాత అందరు సహకరించారని అరుణ్ జైట్లీ ఇటీవల ఓ మీటింగ్ లో తెలియజేశారు. దీంతో దేశంలో ప్రతి నాయకుడు జీఎస్టీ బిల్లుపై అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. అయితే కేసీఆర్ కూడా ఈ విషయంపై గవర్నర్ తో ప్రత్యేక చర్చ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. జీఎస్టీ పై ఎంపిలు, ఎమ్మేల్యేలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. అలాగే ముఖ్యమంత్రి శనివారం మంత్రి వర్గ సమావేశం జరపనున్నారు.

Comments