అర్థరాత్రి అమ్మాయిని కారు ఎక్కించుకుని సర్వం పోగొట్టుకున్నాడు..!


బెంగుళూరు లోని కొందరు మహిళల ముఠా మగాళ్ల బలహీనతలనే తన సంపాదనగా మార్చుకుంటున్నారు. వీరు గ్రూప్ లుగా విడిపోయి అర్థరాత్రి కారుల్లో ఒంటరిగా ప్రయాణించే మగాళ్లను టార్గెట్ చేసుకుని దొంగ తనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో పోలీస్ లు దీనిపై దృష్టిపెట్టారు. పోలీస్ ల వివరాల ప్రకారం అర్థ రాత్రి సిటివీధుల్లో అందంగా తయారైన మహిళలు కారుని ఆపి లిఫ్ట్ అడుగుతారని ఆ తరువాత వారి టాలెంట్ చూపించి సదరు వ్యక్తి వద్ద ఉన్న విలువైన వస్తువు లతో మాయం అవుతారని అంటున్నారు.

కారు ఎక్కగానే మాటలతో మత్తెక్కించే వీరు కారుని నిర్మానుష్య ప్రాంతం లోకి తీసుకుని వెళ్ళమని కోరతారని పోలీస్ లు అంటున్నారు. వారి మాటలకు పడిపోయారో అంతే సంగతులు అని పోలీస్ లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగుళూరు లోని ఓ వ్యాపారికి ఎదురైనట్లు తమకు ఫిర్యాదు అందినట్లు పోలీస్ లు చెబుతున్నారు. ఇందిరానగర్ కు చెందిన ఓ వ్యాపారి తన ఫ్రెండ్స్ ని డ్రాప్ చేసి ఒంటరిగా కారులో ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గ మద్యంలో ఓ అమ్మాయి కనిపించి లిఫ్ట్ ఆడితే కారు ఎక్కిచుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతడిని కౌగిలించుకుంటూ నానా హంగామా చేసింది. దీనితో బెదిరిపోయిన సదరు వ్యాపారి కారు దిగి వెళ్లిపోవసిందిగా ఆమెని హెచ్చరించాడు లేకుంటే పోలీసులను పిలుస్తాననిఅన్నాడు. దీనితో ఆమె వెళ్ళిపోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంటికి వెళ్లి చూస్కుంటే తన మేడలో ఉన్న బంగారు చైను, తన వాలెట్ కనిపించలేదు. చాకచక్యంగా ఆమె చేసిన దొంగతనానికి ఆశ్చర్యపోయిన అతడు పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు.

Comments