ఫోన్ మాయలో పడి.. అందులో పడిపోయిన మహిళ: వీడియో

ఈ రోజుల్లో ఫోన్ల వాడకం ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుండి వృదులవరకు పోను మాట్లాడుతూ పక్కన ఏ ప్రమాదం జరిగిన పట్టించుకోరు. ఇదే తరహాలో అమెరికాలోని న్యూ జెర్సీ లో ఓ అరుదైన ఘటన చేసుకుంది. అప్పటివరకు సాధారణంగా చుట్టూ చూస్తూ నడుస్తున్న ఒక 67 ఏళ్ల మహిళకు సడన్ గా ఓ పోన్ కాల వచ్చింది. దీంతో ముందు ఏం ఉందొ కూడా చూడకుండా అలానే వెళ్ళింది. అయితే ఆమె నడుస్తున్న ప్రదేశంలో ఎదో మరమ్మతులు జరుపుతున్నారు. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆ మహిళా అలానే నడుచుకుంటూ వెళ్లి ఒక్కసారిగా అందులో పడిపోయింది.

అయితే పక్కనే నడుస్తున్న ఓ ఇద్దరు యువతులు ఆమే పడిపోతున్నదని పట్టుకోవడానికి ప్రయత్నించిన అప్పటికే ఆమె అందులో పడిపోయింది. ఆమె అదృష్టం బావుండి లోపల కొందరు మనుషులు ఉండడంతో బయటకి తీశారు. అయితే ఆమె తీవ్రంగా గాయబడటంతో హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింద ఇచ్చిన వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Comments