ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

షాక్ : సీమ బ్రదర్స్ కుమారులు X జనసేన !

దశాబ్దాల కాలం నుంచి రాయలసీమ అనంతపురం రాజకీయాలను జేసీ బ్రదర్స్ శాసిస్తున్నారు. వారి కంటి సైగతే అక్కడి రాజకీయాలను నడిపిస్తారని ప్రచారం ఉంది. కాంగ్రెస్ ఆ పార్టీ రూలింగ్ లో ఉన్న సమయంలో జిల్లా పూర్తిగా వీరి గుప్పెట్లో ఉండేదని ప్రచారం. కానీ టిడిపి రూలింగ్ లోకి వచ్చాక జిల్లాలో వీరి హవా కొంత తగ్గిందనేది రాజకీయ వర్గాల మాట. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టిడిపిలో చేరారు. ఇప్పటికీ వారి నియోజకవర్గాల్లో జేసీ బ్రదర్స్ తమ పట్టుని నిలుపుకుంటున్నారు. కానీ జిల్లాలో మిగిలిన టిడిపి నేతల నుంచి వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులలో ఆయన కూడా ఒకరు. విశేష అనుభవం ఆయన సొంతం. కాగా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో రిటైర్ మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి వైదొలగకపోయినా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నట్లు అనంతపురం రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

జేసీ తన కుమారుడు పవన్ ని రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన తన వ్యూహాలకు పదును పెట్టారని అంటున్నారు. మరో వైపు దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా ఇదే ఆలోచనతో ఉన్నారట. ఆయన తన కుమ్మాడు అస్మిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలని భావిస్తున్నట్లు జేసీ సోదరుల అనుచరుల చెబుతున్నారు. ఇప్పటికే జెసి తనయుడు పవన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఫ్లాట్ ఫామ్ ని క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నాడట. అనంతపురం జిల్లాలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

కాగా ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అనంతపురం జిల్లా నుంచే పోటీ చేయనుండడం. సాధారంగానే అనంతపురం అంటే జిల్లా అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన తరువాత అనంతపురంపై మీడియా అటెన్షన్ మరింతగా పెరిగింది. జిల్లాలో జేసీ బ్రదర్స్ కు ఉన్న ప్రాధాన్యత, మరోవైపు తాను తొలి సారి పోటీ చేయడానికి పవన్ అదే జిల్లాని ఎంచుకోవడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జేసీ సోదరుల తనయులు పొలిటికల్ ఎంట్రీ నిజమే అయితే.. వారు జనసేన పార్టీని ఏవిధంగా ఎదుర్కొంటారు ? పవన్ కళ్యాణ్ జేసీ బ్రదర్స్ హవాకి ఏవిధంగా చెక్ పెడతాడు ? అనే విషయాలు ఉత్కంఠని కలిగిస్తున్నాయి.

Comments