ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

షాకింగ్‌: ఫైన‌ల్‌పై 2000 కోట్ల బెట్టింగ్‌?

దాయాదుల పోరుకు రంగం సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భార‌త్ – పాకిస్తాన్ మ‌ధ్య‌ ఫైనల్ మ్యాచ్ ఈ ఆదివారం జ‌ర‌గ‌ను్న సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్ న‌డుస్తోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ మ్యాచ్‌పై రికార్డు స్థాయిలో 2000 కోట్ల మేర బెట్టింగ్ న‌డిచింద‌ని చెబుతున్నారు. ఈ పోరులో టీమిండియా గెలుపుపై ధీమాతో ఉన్న బుకీలంతా అటువైపే ఫేవ‌ర్‌గా ఉన్నారుట‌. ఆ మేర‌కు బుకీల‌కు లాభాల్లో మార్జిన్ ప‌డిపోయింద‌ని చెబుతున్నారు.

టీమిండియాపై రూ.100 పెడితే రూ.148 గెలుచుకోవ‌చ్చు. అదే మ‌న ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు పాక్‌పై రూ. 100 బెట్టింగ్‌ కాస్తే ఏకంగా 300 గెలుచుకునే అవ‌కాశం ఉంటుంది. పాకిస్తాన్ – ఇండియా యుద్ధం, వైరం నేప‌థ్యంలో ఇటీవ‌లి కాలంలో ఇరు దేశాలు క‌లిసి ఆడిందే లేదు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య యుద్ధం జ‌ర‌గ‌బోతోంది. ఇది ఇండియా- పాక్ యుద్ధం లాంటిదే కావ‌డంతో బెట్టింగ్ అన్‌లిమిటెడ్‌గా సాగుతోందిట‌. ఇక ఈ బెట్టింగ్ న‌డుస్తున్న తీరు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంద‌ని చెబుతున్నారు. భారత్‌లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్టవిరుద్ధం కాబ‌ట్టి.. వీటిపై క‌ట్ట‌డి లేని బ్రిట‌న్ లాంటి చోట ఈ కార్య‌క‌లాపాలు ఎక్కువ సాగుతున్నాయిట‌. ఇంట‌ర్నేష‌న‌ల్‌ క్రెడిట్ కార్డ్స్, ఈ-వాలెట్స్‌తో యూకే వెబ్‌సైట్స్‌కు లాగిన్ అయి బెట్టింగ్‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

Comments