ప్రచురణ తేదీ : Fri, Apr 21st, 2017

చిత్తూరులో బతుకులను చిదిమేసిన లారీ..ఘోర ప్రమాదంలో 20 మంది మృతి..!


చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు లో భారీ లోడ్ తో వెళుతున్న లారీ అదుపు తాపీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం ఒక్కసారిగా దుకాణాలపై, కాలినడకన వెళుతున్న వారిపై దూసుకెళ్లడంతో ఘోరం జరిగింది.ఈ ప్రమాదంలో 20 మంది ప్రజలు దుర్మరణం చెందారు.మరో 20 మందికి పైగా గాయపడ్డారు.

గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. లారీ దూసుకుని వస్తున్న సమయం లో పోలీస్ స్టేషన్ వద్ద ఎక్కువ మంది జనం ఉండడంతో ప్రాణనష్టం కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది. అదుపుతపైనా లారీ దూసుకుని రావడంతో విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి.కరెంట్ షాక్ కి గురై కొంతమంది మరణించినట్లు తెలుస్తోంది.దారుణమైన ఘటన జరగడంతో ఆ ప్రాంతం మొత్తం తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే అలరి డ్రైవర్, క్లినర్ అక్కడినుంచి పరారైనట్లు తెలుస్తోంది. హోమ్ మంత్రి చినరాజప్ప ఘటన పై తిరుపతి అర్బన్ ఎస్పీ తో స్యయంగా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

 

Comments