ప్రచురణ తేదీ : Sun, Jun 18th, 2017

1000 ఎక‌రాల ముద‌పాక భూస్కాం? ఏమ‌వుతోంది?


విశాఖ‌- ముద‌పాక (పెందుర్తి) భూస్కాం విలువ‌ ఏకంగా వేల కోట్లు. దాదాపు 1000 ఎక‌రాల‌పై బ‌డా బాబులు క‌న్నేసి రైతుల నుంచి భూములు లాక్కోవ‌డంపై అప్ప‌ట్లో పెనుకంప‌నం పుట్టిన సంగ‌తి తెలిసిందే. ల్యాండ్ పూలింగ్ పేరుతో 40 ఏళ్ల క్రితం పేద‌ల‌కు ఇచ్చిన భూముల్ని కొంద‌రు భూ బ‌కాసురులు లాక్కోవ‌డంపై రైతులే తిర‌గ‌బ‌డ‌డం పెద్ద చ‌ర్చ‌కొచ్చింది. గ‌త ఆర్నెల‌లుగా సాగుతున్న‌ ముద‌పాక భూముల దందాల‌పై రైతులంతా ఇప్ప‌టికీ క‌లెక్ట‌రేట్ల చుట్టూ తిరుగుతుంటే వాళ్ల‌కు న్యాయం జ‌ర‌గ‌లేదు స‌రిక‌దా.. ఇలా వెళుతున్న రైతులంద‌రిపై స‌ద‌రు భూబ‌కాసురులు ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, అన్యాయంగా జైల్లో వేస్తున్నారని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత పెద్ద స్కాం జ‌రిగినా సిట్ దర్యాప్తు వేయ‌లేదు. వెంట‌నే సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ వేయించండి. రైతుల‌కు న్యాయం చేయండి. ఎవ‌రైతే రైతుల ప‌ట్టాలు లాక్కున్నారో వాళ్లంద‌రినీ అరెస్టు చేయండి అంటూ ముద‌పాక రైతులు నినాదాలు చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. న‌డింప‌ల్లి వెంక‌ట రామ‌రాజు పేరు మీద‌నే ముద‌పాక రైతుల‌కు చెక్కులిచ్చారు. వాళ్లే రోడ్లు వేశారు. రియ‌ల్ వ్యాపారం చేస్తున్నారు. కానీ వాళ్ల‌లో ఎవ‌రినీ ఇంత‌వ‌ర‌కూ అరెస్టు చేసిందే లేదు.. అంటూ ఆ ఊరి జ‌నం ర‌చ్చ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అయితే ఈ కేసును ఏపీ ప్ర‌భుత్వం కానీ, అధికారులు కానీ సీరియ‌స్‌గా తీసుకున్నారా? విచార‌ణ జ‌రుగుతోందా? లేదా? అన్న‌ది తెలియ‌నేలేదు. మ‌రి ఏం జ‌రుగుతున్న‌ట్టు?

Comments